10 April, 2026 | 3:43 AM

గంజాయి ముఠా గుట్టురట్టు

08-12-2024 01:27 AM

మేడ్చల్, డిసెంబర్ 7: ఒడిశా రాష్ట్రం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠాను శనివారం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పీఎస్ పరిధిలోని మజీద్‌పూర్ వద్ద ఓ ఓపెన్ వెంచర్‌లో గంజాయి విక్రయాలు చేపడుతున్నారనే పక్కా సమాచారం మేరకు మేడ్చల్ జోన్ ఎస్‌వోటీ, శామీర్‌పేట్ పోలీసులు నిర్వహించిన దాడిలో..

నయన్ దాస్, అనికేత్ సింగ్, రోహిత్, దాల్వలెలకేశ్ రాజ్‌సింగ్, గీత మండల్, రీత మిస్త్రీ, ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 26 కిలోల గంజాయి, ఒక కారు, రెండు బైక్‌లు, నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.

రూ.1.75కోట్ల గంజాయి దహనం

హైదరాబాద్ సిటీబ్యూరో,  డిసెంబర్ 7(విజయక్రాంతి): నగరంలోని ధూల్‌పేట్, నాంపల్లి, ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన రూ.1.75కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.

187కేసుల్లో పట్టుబ డిన 621కిలోల గంజాయి, 101కిలోల పాపిష్ట, 0.4కిలోల బంగ్, 46గ్రాముల ఎండీఎంఏ, 108ఎల్‌ఎస్‌డీ బ్లాస్ట్స్‌ను.. షాద్‌నగర్‌లోని మల్టీకౌఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కంపెనీలోని ఖాళీ స్థలంలో కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో డిస్పోజబుల్ డీడీసీ మోహన్‌బాబు, ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.