16 August, 2026 | 1:15 AM

ఆకట్టుకున్న స్వాతంత్య్ర వేడుకలు

16-08-2026 12:00 AM
  1. జాతీయ జెండాను ఆవిష్కరించిన విప్ ఆది శ్రీనివాస్
  2. సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీ కరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిం చారు.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, పోలీసులు, మున్సిపల్, గ్రామ పం చాయతీ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. వ్య వసాయ, ఉద్యానవన, చేనేత, మత్స్య, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేశారు.

స్త్రీనిధి ద్వారా మహిళా సం ఘాల సభ్యులకు ఈ-స్కూటీలు, ఈ-ఆటోలు పంపిణీ చేశారు. 24 మందికి రూ.1 లక్ష వి లువైన ఈ-స్కూటీలు, రూ.14.25 లక్షల విలువైన ఈ-ఆటోలను అందించారు. 855 మహి ళా సంఘాలకు రూ.100.12 కోట్ల బ్యాంకు రుణాలు, 847 సంఘాలకు రూ.20.66 కోట్ల స్త్రీనిధి రుణాలను పంపిణీ చేశారు.టీవీసీసీ పథకం కింద దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ఆటో, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్లను అందజేశారు. మున్సి పల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులున్నారు.