16 August, 2026 | 1:59 AM

యువత రాజకీయాల్లోకి రావాలి

16-08-2026 12:00 AM
  1. వేములవాడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత మహేష్
  2. నంది చౌరస్తా వద్ద ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

వేములవాడ, ఆగస్ట్ 15, (విజయ క్రాం తి): యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో కీలక పాత్ర పోషించాలని వేములవాడ నియోజకవర్గయూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత మహేష్ పిలుపునిచ్చారు. శనివారం వేములవాడలోని నంది చౌరస్తా వద్ద ఆయన ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాత మహే ష్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ అని అ న్నారు.

జాతీయ జెండా దేశ ప్రజల త్యాగా లు, ఆశలు, పోరాటాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలో పయనిస్తూ సమానత్వ ం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాజకీయాలు పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం పనిచేసే వేదికగా ఉండాలన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే కొత్త ఆలోచనలు, మార్పు, నాయకత్వం వస్తాయని పే ర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ యువతను ప్రజాసేవ వైపు నడిపించడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమన్నారు.