దేశభక్తిని పెంపొందించుకోవాలి
16-08-2026 12:00 AM
- పీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ సాయికుమార్
- గోషామహల్ జుమ్మారాత్ బజార్ వద్ద స్వాతంత్య్ర వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): గోషామహల్ నియోజకవర్గం జుమ్మా రాత్ బజార్ వద్ద 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ త్రివర్ణ ప తాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ ‘స్వాతంత్య్ర సమరయోధుల నిస్వార్థ త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తు న్నాం.. యువత దేశభక్తి భావాలను పెంపొందించుకోవడమే కాకుండా, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామరాజు సింగ్, మహావీర్ సింగ్ ,ఠాకూర్ రన్వీర్ సింగ్, తదిరులు పాల్గొన్నారు .






