calender_icon.png 7 August, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు లారీ ఢీ.. ఒకరు మృతి

07-08-2025 01:17:55 AM

మహబూబాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సంపేటకు చెందిన బూర అశోక్ దుర్మరణం పాలయ్యాడు. అశోక్ తన కారులో గూడూరు నుండి నర్సంపేట వైపు వస్తుండగా నర్సంపేట నుండి మహబూబాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొన్నాయి.

ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జుగా మారింది. సంఘటనస్థలిలోనే కారు డ్రైవ్ చేస్తున్న అశోక్ మరణించాడు. అశోక్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఎస్ ఐ గిరిధర్ రెడ్డి జేసిబీ తెప్పించి వెనుక వైపు ట్రాక్టర్ కట్టి కారు ముందు భాగాన్ని లాగడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతుడు అశోక్ నర్సంపేటలో ఐరన్ షాపు నిర్వహిస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

కంబాలపల్లి వద్ద రెండు కార్లు ముగ్గురు వైద్యులకు గాయాలు

గూడూరు - మహబూబాబాద్ రహదారిలో కంబాలపల్లి వద్ద రెండు కాళ్లు ఢీకొనగా ముగ్గురు వైద్యులు గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో విధులు నిర్వహిం చేందుకు కారులో వస్తున్న వైద్యులు డాక్టర్ అశోక్ రెడ్డి, నితీష్ కుమార్, మరో కారులో ప్రయాణి స్తున్న డాక్టర్ రామ్మోహన్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

కంబాలపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు

హనుమకొండ నుండి మహబూబాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు గూడూరు మహబూ బాబాద్ మార్గమధ్యలో ఉన్న కంబాలపల్లి వద్దకు రాగానే ఇంజన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుండి కిందికి దిగారు.  ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించినప్పటికీ కొంతసేపు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.