07-08-2025 01:19:19 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభ.. సోనియా గాంధీ కుటుంబాన్ని పొగడడానికే సరిపోయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శిచారు. రాష్ర్టంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ఢిల్లీ సభ పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని ఒక ప్రకటనలో ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి ప్రసంగంలో 50 శాతం కంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్ర జలకు హామీ ఇచ్చారని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తా మంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా.. కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి.. 18 నెల లుగా ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాల అ మలు ఊసెత్తడమే లేదన్నారు. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పా రని, దీని ప్రకారం ఇప్పటికే కనీసం రూ.40 వేల కోట్లు ఇవ్వాలని.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బీసీలను నిలువునా మో సం చేశారని ఆరోపించారు.
వ్యతిరేకత నుంచి బయట పడేందుకే
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేకపోయారని, ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్ర హించి, రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీసీలకు సాధికారత కల్పించే విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదనేది తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైందన్నారు.
ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి పగటివేషాలు వేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల్ సీట్లలో ముస్లింలు పోటీ చేసి, 50 రిజర్వ్‌డ్ సీట్లలో 31 చోట్ల గెలిచారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీ చెప్పినట్లు పని చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పుడు అధికారికంగా 10శాతం ముస్లింలను బీసీల్లో చేర్చి 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తే.. బీసీలకు రాజ్యాధికారం కష్టమేననేది తెలంగాణ స మాజానికి అర్థమైందన్నారు. ముందుగా అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారని, ఆ తర్వాత దీనికి 10శాతం ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే నేడు కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు.
ముస్లిం బీసీ రిజర్వేషన్లను అంగీకరించం
రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టే మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరు తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. 1955లో బీసీలకు రిజర్వేషన్లకు కల్పించాలన్న కాకా కాలేల్‌కర్ కమిషన్ రిపోర్టును నెహ్రూ పక్క న పెట్టారని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కలసి మండల్ కమిషన్ రిపోర్టును ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని తెలిపారు.
ప్రతి సందర్భంలోనూ నెహ్రూ కుటుంబం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. నరేంద్ర మోదీని రేవంత్‌రెడ్డి విమర్శిస్తే.. అది ఆకాశం మీద ఉమ్మేయడమేనని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలో సుస్థిరమైన పాలన అం దుతోందని, అందుకే రాబోయే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురిం చి ఆలోచించడం మానుకోవడమే ఉత్తమమని ఆయన హితవు పలికారు.