16-11-2025 12:07:15 AM
సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం మార్పుతో విద్యార్థుల ఇబ్బందులు
కాప్రా, నవంబర్ 15 (విజయక్రాంతి): డెవ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కు చెందిన 2020 బ్యా విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రస్తుత యాజమాన్యం నిరాకరించిన ఘటనపై కుషాయి గూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విద్యార్థుల ఒక్కరి నుంచి పాత యాజమాన్యం రూ.36,500 ట్యూషన్ ఫీజులు వసూలు చేసి, నాలుగు నెలల తరువాత కాలేజీ యాజమాన్యాన్ని మార్పుతో పాటు సంస్థను చక్రిపురానికి మార్చింది.
కోర్స్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు మీరు ఫీజులు చెల్లించలేదు పాత యాజమాన్యం విషయం మాకు తెలియదు అంటూ ప్రస్తుత యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థులు దీనిపై ఆవేదన వ్యక్తం చేసారు. సాయి కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.