16-11-2025 12:39:32 AM
-2030 నాటికి తీర్చిదిద్దేలా కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్
-ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): 2030 నాటికి తెలంగాణను దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇం దుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వా మ్యంతో ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ను రాష్ర్టంలో అభివృద్ధి చేసేందుకు కాంప్రెహెన్సి వ్ రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామని వివరించారు.
ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటెజిక్ డిఫెన్స్ హబ్‌గా మార్చాయని వెల్లడించారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌బీ, ముంజా ల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంయుక్తాధ్వర్యంలో శనివారం గచ్చిబౌ లిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో నిర్వహించిన ఎంపవరింగ్ ఆత్మనిర్భ ర్ భారత్ ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కు శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏ అండ్ డీ రంగం లో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల వల్ల గ్లోబల్ సప్లు చెయిన్ ఒత్తిడికి గురవుతున్నదని, ఈ తరుణంలో విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం ప్రపంచం ముఖ్యంగా భారత్ లాం టి దేశాల వైపు చూస్తున్నదని పేర్కొన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం కీలక పాత్ర పోషించేలా సమగ్ర ప్రణాళికలు రూ పొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ర్టంలో 25కు పైగా ఏ అండ్ డీ అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థ లు, సుమారు 1500కు పైగా ఎంఎస్‌ఎంఈలు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
రాష్ర్ట ఏరోస్పేస్ ఎగు మతుల విలువ 2023 రూ.15,900 కోట్లు కాగా, 2024 25లో కేవలం మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం రాష్ర్ట ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు సాక్ష్యమని చెప్పారు. ఆదిభట్లలో రూ.425 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన టాటా ఫెసిలిటీ ఇటీవల అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు.
త్వరలోనే రూ.800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ యూఏవీ మా న్యూఫ్యాక్చరింగ్ యూనిట్, రూ.500 కోట్లతో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ కూడా వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రెజైస్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్, ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ పీ మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.