16-11-2025 12:57:01 AM
వారిలో ఆజాద్, అబ్బాస్ నారాయణ్ అలియాస్ రమేష్‌లు
చర్ల, నవంబర్ 15 (విజయక్రాంతి):తెలంగాణలో హై కేడర్ మావోయిస్టు తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొయ్యడి సాంబయ్య అలియాస్ ఆజాద్, అబ్బాస్ నారాయణ్ అలియాస్ రమేష్‌లు ఆయుధాలతో సహా లొంగిపోయిన వారిలో ఉన్నారు. అగ్ర మావోయిస్టు నాయకుడు ఆజాద్ ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో సీనియర్ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు.
గతంలో ఆజాద్ పేరు మీద కూడా కొన్ని లేఖలు విడుదలయ్యాయి. ఆజాద్ అధికార ప్రతినిధిగా పనిచేశాడు, ఆజాద్ అలియాస్ సాంబయ్య అలియాస్ గోపన్న తెలంగా ణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా మావోయిస్టు పార్టీలో పనిచేశా డు. ఆజాద్ పాటు అబ్బాస్ నారాయణ్ అలియాస్ రమేష్ మరో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు.
మావోయిస్టు అరెస్టు..
చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో అరెస్టయిన వారెంటీ మావోయిస్టు కుంజం దేవా 2003లో ఆశ్రమంలోని సిల్గర్ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో బాంబు అమర్చాడు. దాని నుంచి భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నాయి.
ఈ కేసులో సుక్మా న్యాయస్థానం నుంచి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అదనంగా ఇతనిపై జగర్గుండ పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన మరో మూడు కేసుల్లో కూడా వారెంట్లు జారీ చేయబడ్డాయి. ఇవి ఏకకాలం లో అమలు చేస్తున్నారు, దేవా పలు ఐఈడీ బాంబులు అమర్చడంలో సమర్ధుడిగా ఉన్నాడు.