calender_icon.png 4 October, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ధ్వంసం కేసులో నిందితుడిపై కేసు నమోదు

04-10-2025 09:06:28 PM

కోనరావుపేట,(విజయక్రాంతి):​ కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల (గొల్లపల్లి) గ్రామంలో కారు ధ్వంసం చేసి లక్ష రూపాయల నష్టం కలిగించిన ఘటనపై కోనరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..​తేదీ 02.10.2025 రోజున రాత్రి పది గంటల ప్రాంతంలో వట్టిమల్ల గ్రామానికి చెందిన బండ రవి, తండ్రి రాజమల్లయ్య (46) కు చెందిన షిఫ్ట్ కారు (నెంబర్ AP 37 AK 9799) ధ్వంసమైంది.

​అదే గ్రామానికి చెందిన మెడుదుల కార్తీక్, తండ్రి చిన్న లింబయ్య, కారును ధ్వంసం చేసి సుమారు లక్ష రూపాయల మేర నష్టం కలిగించినట్లు బాధితుడు రవి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్.ఐ. కె. ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులను గానీ, ప్రైవేట్ ఆస్తులను గానీ ధ్వంసం చేసి నష్టపరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తి నష్టాన్ని కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రజలు సంయమనం పాటించాలని ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డి సూచించారు.