calender_icon.png 4 October, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి పనుల్లో నాణ్యత లోపించకూడదు

04-10-2025 09:14:58 PM

పనులు వేగవంతం చేయాలని గుత్తేదారునికు సూచించిన ఎమ్మెల్యే 

పనులు జరుగుతున్న దృశ్యాన్ని చూపిస్తున్న ఇంజనీర్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): నెల రోజులు క్రితం కురిసిన భారీ వర్షానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం లింగంపేట్ కూర్దు, కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మార్గమధ్యలో ఉన్న వంతెన అకస్మాత్తుగా దెబ్బతినడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూలిపోయిన వంతెన వద్దకు వచ్చి చూసి తక్షణమే ఆ ప్రాంతంలో నూతన వంతెన నిర్మాణం చేయాలని కోటి రూపాయలు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు.

నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు నడుస్తున్న నేపథ్యంలో పనులు జాప్యం చేయరాదని పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించిన గుత్తేదారునిపై చర్యలు తప్పవని బ్రిడ్జి నిర్మాణ గుత్తేదారుకు సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనుల్లో ఎటువంటి నాణ్యత లోపించకుండా నిర్మాణ పనులు చేయించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర నారగౌడ్ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొండ్ల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.