04-10-2025 09:02:54 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కని పెంచి పెద్ద చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తండ్రి అకాల మృత్యువాత పడగా కొడుకులు, కూతురు కలిసి నిత్యం గుర్తుండే విధంగా తండ్రికి గుడి కట్టి అందులో ఆయన శిలా విగ్రహం ఏర్పాటు చేసి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలో జరిగింది. కేసముద్రం పట్టణానికి చెందిన నర్సింగం రాజలింగం గత ఏడాది చనిపోయారు. శనివారం ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు మల్లేష్, వెంకటేష్, కూతురు అల్లుడు హైమ రమేష్, భార్య ఐలమ్మ ఆధ్వర్యంలో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద గుడి కట్టి అందులో విగ్రహం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.