calender_icon.png 15 May, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు

15-05-2025 01:43:11 PM

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు

ట్రాఫిక్‌ పోలీస్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన శ్రీనివాస్‌

కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లి కానిస్టేబుల్‌పై దుర్భాషలాడిన బెల్లంకొండ

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్(Hero Bellamkonda Srinivas) పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station)లో గురువారం కేసు నమోదైంది. బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అంతటితో ఆగకుండా జూబ్లీహిల్స్‌లో రెండ్రోజుల క్రితం ట్రాఫిక్‌ పోలీస్‌ పట్ల శ్రీనివాస్‌ దురుసుగా ప్రవర్తించాడు. కారుతో రాంగ్‌రూట్‌లో నడుపుతుండగా అడ్డుకున్న కానిస్టేబుల్‌పై బెల్లంకొండ శ్రీనివాస్‌ దుర్భాషలాడినట్లు ఆరోపణలున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ దగ్గర రాంగ్ రూట్ లో ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాలుగు రాబోయే సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అతను భైరవం, టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధాపురి చిత్రాల్లో నటిస్తున్నాడు.