15-05-2025 12:19:37 AM
ఖుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అయ్యనా మానే’. దీనికి రమేశ్ ఇందిర దర్శకత్వం వహించారు. ఇది జీ5 కన్నడ ఒరిజినల్ సిరీస్ కాగా.. కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఇప్పటికే భారీ విజయం సాధించిందీ సిరీస్.
చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ సిరిస్ ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. మే 16 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.