20-11-2025 06:12:58 PM
ఖమ్మంపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పై కేసు నమోదు..
ముత్తారం ఎస్.ఐ రవికుమార్ హెచ్చరిక..
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని మానేరు నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రవికుమార్ హెచ్చరించారు. గురువారం ఉదయం పోలీసులు ఖమ్మంపల్లి గ్రామ పరిసరాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా గ్రామానికి చెందిన పన్నాల సురేష్ యాదవ్ అనే వ్యక్తి అక్రమంగా తన ట్రాక్టర్ లో ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డాడని, అతని వద్ద ఏమైనా అనుమతి పత్రాలు ఉన్నాయని అడుగగా లేవని తెలపడంతో వెంటనే ట్రాక్టర్ ను, అతన్ని పోలీసు స్టేషన్ కి తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా మండలంలో ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.