calender_icon.png 20 November, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెర్వుగట్టు ఆలయంలో కార్తీకమాస పూర్ణాహుతి

20-11-2025 06:19:22 PM

లడ్డు, పులిహోర ప్రసాదాలను పరిశీలించిన ఈఓ మోహన్ బాబు.. 

నకిరేకల్ (విజయక్రాంతి): కార్తీకమాసం ముగింపు సందర్భంగా శ్రీ పార్వతీజడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య రుద్రహోమాల భాగంగా గురువారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని ప్రసాద తయారీశాలను విక్రయ కౌంటర్లను ఈఓ స్వయంగా పరిశీలించారు. లడ్డు పులిహోర పరిమాణాన్ని పరిశీలించారు. స్వామి వారి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ తెలిపారు.