calender_icon.png 7 September, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమంపై కేసులను ఆన్ లైన్ చేయాలి

06-09-2025 11:12:50 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమంపై చేసే కేసులను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా దాఖలు చేయవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ - 2007, రాష్ట్ర నియమావళి 2011 ప్రకారం ఇకపై వయోవృద్ధుల సంరక్షణ సంక్షేమం కోసం దాఖలు చేసే కేసులు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్ (టీఎస్సీఎంఎంఎస్) ఆన్లైన్ పోర్టల్ ద్వారా/మీసేవ కేంద్రాల ద్వారా దాఖలు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఆఫ్ లైన్ లో కేసులు దాఖలు చేసే విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని, ఈ నేపథ్యంలో టి.ఎస్.సి.ఎం.ఎం.ఎస్. పోర్టల్ వినియోగం గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. సీనియర్ సిటిజెన్లు తమ హక్కులను రక్షించుకోవడానికి, సమస్యల పరిష్కారం కోసం పోర్టల్ వేదికను వినియోగించుకోవాలని కోరారు.