calender_icon.png 7 September, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు

06-09-2025 11:08:53 PM

వీణవంక,(విజయక్రాంతి): జల్సాలకు అలవాటు పడి పేకాట ఆడుతూ బాగా నష్టపోయి, అయిదు చోట్లా బంగారం ఆభరణాలు దొంగతానాలు చేస్తూ వీణవంక పోలీసులకు పెట్రోలింగ్ లో పట్టుబడిన సంఘటన వీణవంక మండలంలో చోటు చేసుకుంది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మీనా వంక మండలం పరిధిలోని కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక రవి పోలీస్ పెట్రోలింగ్  లో భాగంగా పట్టుకున్నామని తెలిపారు.

వీణవంక మండలం లోని మామిడాలపల్లి, దేశాయిపల్లి, చల్లూరు, జమ్మికుంట మండలంలోని  కొత్తపల్లి,మాన కొండూర్ మండలంలోని అన్నారం లలో ని వృద్ధులపై  ఇతడు టార్ గెట్ పెట్టుకొని దొంగ తనాలకు పాల్పడిన ట్లు తెలిపారు. మొత్తం కలిపి 14 తులాల బంగారం చోరీ చేసినట్టు తెలిపారు.సుల్తానాబాద్ లోని ముత్తుట్ పిన్ కేర్  పెట్టినట్లు తెలిపారు.ఇందులో ప్రస్తుంతం 11 తులాలు రికవరి చేశామని,మిగతా బంగారం లో కొంత మహారాష్ట్ర లోగుర్తు తెలియని వ్యక్తి కి అమ్మినట్లు తెలిపారు.ఏసీపీ వెంట జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై తిరుపతి ఉన్నారు. కాగా చాక చక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బంది కి రివార్డ్ లు అందించారు.