calender_icon.png 7 September, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అమెరికా పత్తి వద్దు... ఆదిలాబాద్ పత్తి ముద్దు

06-09-2025 11:17:44 PM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవి కుమార్

ఆదిలాబాద్,(విజయక్రాంతి):  అమెరికా నుండి జీరో తారీఫ్ తో పత్తి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవలిని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్ డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమెరికా పత్తికి నిరసన ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమెరికా పత్తి  సంబంధించిన ప్రతులను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉధృతంగా నెలకొంది.

ఈ మేరకు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్ మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల దేశంలోని రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అన్నారు. ఆదిలాబాద్ లోని ఆసియా ఖండంలోనే అత్యంత నాణ్యమైన పత్తి అన్నారు. అలాంటి రైతులు భవిష్యత్తులో పత్తిని గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక అప్పుల పాలై పత్తి పంటను పండించడమే మానేస్తారని అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ పత్తి పంటనే ప్రధాన ఆధారం రైతులు దివాలా తీస్తే దీని ప్రభావం అన్ని రంగాల మీద పడుతుందని అన్నారు. తద్వారా ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా దివాలా తీస్తుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని ప్రజలందరూ, రైతులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అందుకోసం సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.