07-09-2025 08:40:53 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ కాలోజీ కళాక్షేత్రంలో జరిగినటువంటి కాకతీయ కళావైభవం కళాకారుల పురస్కారంలో భాగంగా తెలుగు ఉభయ రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు, కేంద్ర ఖాది చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశంకు రామకోటయ్య, ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, శ్రీ గాయత్రి పీఠం పీఠాధిపతులు జగద్గురు డాక్టర్ శ్రీ కాతేంద్ర స్వామి చేత ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ.. లిపిలేని కళాకారులకు పెన్షన్ ఇస్తానని మ్యానిఫెస్టోలో పెట్టి గత గత ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం స్పందించి సంచార కులాలు కళాకారులను, లిపిలేని వారికి చేయూతనిచ్చి పెన్షన్ సౌకర్యం కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శాంతి కృష్ణ, డాక్టర్ బండ ప్రకాష్, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ సాంబార్ సమ్మా రావు, సినీ కళాకారుడు రఘు, కళాకారులు ప్రజలు పాల్గొన్నారు.