13 July, 2026 | 6:23 AM

మెగా లోక్ అదాలత్ లో 3112 కేసుల పరిష్కారం

09-06-2024 06:08 PM

జగిత్యాల : జాతీయ మెగా లోక్ అదాలత్ లో 3112 కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదివారం జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. రాజీ మార్గమే రాజామార్గం అని రాజీ పడదగిన కేసుల్లో రాజీమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని తద్వారా సమయం వృధా కాదని కక్షలు తగ్గి స్నేహభావం పెంపొందుతుందని  జిల్లా ఎస్పీ అన్నారు. కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురయ్యే వారికి సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాజీ మార్గాన కేసుల పరిష్కరించడానికి  కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జగిత్యాల జిల్లా పరిధిలో  ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి డీఎస్పీలు, సిఐలు ఎస్ఐలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించడంతోపాటు వారికి సంపూర్ణ అవగాహన కల్పించారు.

దీంతో జగిత్యాల జిల్లా పరిధిలో  లోక్ అదాలత్ ద్వారా 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో  డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన 1894 కేసులో ఉన్న వారికి కోర్టు మొదటి తప్పుగా భావించి  జరిమానాలు విధించడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపి మరోసారి పట్టుబడినట్లైతే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. 538 ఈ పెట్టి కేసులు, 680 ఐపిసి కేసులు జిల్లా వ్యాప్తంగా వివిధ సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసులు 3112 కేసులు పరిష్కారం చూపించడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.