కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
జగిత్యాల: సుప్రసిద్ధత కొండగట్టు ఆంజనేయస్వామిని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆంజనేయస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిల సంపూర్ణ సహకారం తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు ఆయనను శాలుకాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






