01-05-2025 06:22:14 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టి సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక, కుల సర్వే నిర్వహించడం జరిగిందని ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. కులగణన ఆధారంగా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లతో పాటు వారి హక్కులను కాపాడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య ఉద్యమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయంగా భావిస్తున్నామని సోయం బాపూరావు పేర్కొన్నారు.