01-05-2025 06:24:49 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో తాపీ మేస్త్రి సంఘం భవనంలో మే డే ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.ఆర్ ఉపాలి మాట్లాడుతూ... కార్మిక వర్గం ప్రజలకు స్వేచ్ఛ కావాలంటూ బానిసతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భంగా కార్మిక వర్గాల చెమట రక్తంతోనే ఎర్రజెండా ఎగరేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. వెట్టి చాకిరి విముక్తికోసం పోరాటాలు చేసిన సందర్భాలను గుర్తు చేసి మేడే జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ఎంఎల్ఎస్ పాయింటు గోదాము నుంచి ఎన్టీఆర్ చౌకు, బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఎగురవేసి మేడే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు కడకుంట్ల రవి, చిలుకూరి, ఇస్తారు కోమటిపల్లి భీమయ్య, నర్సింలు, మద్దెల రాజలింగం, సురపాక రాజన్న, మాదాసు నరసయ్య, చంద్రయ్య, సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిట్టల భీమేష్, పిల్లి రమేష్, చిన్న భీమేష్ తదితరులు ఉన్నారు.