calender_icon.png 1 May, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిలో జిల్లా టాపర్ గా వైష్ణవి

01-05-2025 06:15:37 PM

కాటారం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో భూపాలపల్లి జిల్లా టాపర్ గా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన ఆకుల వైష్ణవి నిలిచింది. పదవ తరగతి ఫలితాల్లో 586/600 మార్కులు సాధించి తన ప్రతిభ కనబరిచింది. దామరకుంట గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచందర్-దేవరాణి కుమార్తె ఆకుల వైష్ణవి 586 మార్కులతో టాపర్ గా నిలిచింది. వైష్ణవి కాటారం మండల కేంద్రంలోని మాంటిసోరి పాఠశాలలో విద్యన్ని అభ్యదించింది. ఈ విషయం తెలిసిన దామరకుంట గ్రామానికి చెందిన విద్యావేత్తలు, మేధావులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.