calender_icon.png 17 November, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే కులగణన సాధ్యం

10-09-2024 04:53:07 AM

  1. సామాజిక న్యాయానికి ప్రభుత్వం పెద్దపీట 
  2. ఓబీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం 
  3. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రివర్గం పూర్తి సహకారం 
  4. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  5. బీసీ కమిషన్ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్‌తోనే కులగణన సాధ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో సోమవారం కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో పాటు పాలకవర్గ సభ్యులుగా జయప్రకాష్, బాలలక్ష్మి, సురేందర్ ప్రమాణ స్వీకారం చేశా రు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఓబీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పటికే కులగణనపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

బీసీ కమిష న్ చైర్మన్‌గా నియమితుడైన నిరంజన్ నాలు గు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయనకు బీసీ కమిషన్ చైర్మన్ పదవి రావ డం.. ఆ పదవికే హుందాతనాన్నిచ్చిందని అభిప్రాయపడ్డారు. త్యాగనిరతి, నిజాయతీ, నిబద్ధతలే నిరంజన్ ఎదుగుదలకు కారణమన్నారు. నిరంజన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బీసీ కులగణనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్కతోపాటు తమ మంత్రి వర్గం కూడా సహకరిస్తుందన్నారు. కులగణనకు ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు ఖర్గే వందశాతం పార్టీ తరఫున ఆమోదం తెలిపారని గుర్తుచేశారు.

ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చట్టసభలతోపాటు ప్రతి వేదికపైనా ఉద్ఘాటిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో ప్రతిష్ఠాత్మకమైన పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించి గుర్తింపునిచ్చామన్నారు. భవిష్యత్‌లోనూ బీసీలకు కాంగ్రెస్ పార్టీ వెన్ను దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అందుకు బీసీలు సంఘటితమై కాంగ్రెస్‌కి, రాహుల్ గాంధీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ఎమ్మెల్సీ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.