17-11-2025 05:48:35 PM
ఢాకా: బంగ్లాదేశ్ ఆందోళన కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన మరణశిక్ష తీర్పును మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తిరస్కరించారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు మోసపూరితమైనది, రాజకీయ ప్రేరేపితమైనదని పేర్కొన్నారు. తనను తాను నిరూపించుకోవడానికి తనకు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనాను దోషిగా నిర్ధారించి, కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏర్పాడిన ప్రభూత్వం కూట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని మండిపడ్డారు. తీర్పుకు ముందు, హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ మాట్లాడుతూ... పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఫిబ్రవరిలో జరిగే జాతీయ ఎన్నికలను ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులు అడ్డుకుంటారని, నిరసనలు హింసకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. షేక్ హసీనా గైర్హాజరీలో విచారణ జరిగింది.
2024లో ఢాకాలో జరిగిన విద్యార్థుల ఆందోళనలతో మాజీ ప్రధాని హసీనా 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ను విడిచి భారతదేశానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. తీర్పుకు ముదుకూడా బాంగ్లాదేశ్ ను ఉద్దేశించి సందేశామిచ్చిన హసీనా ఎవరు బాధపడొద్దని అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలను కోరారు. నేను బాతికే ఉన్నాని.. ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానన్నారు. వాళ్లు ఏ తీర్పు ఇచ్చాసరే నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. దేవుడు ఇచ్చిన ప్రాణం.. ఆయన తీసుకుపోయినప్పుడే పోతాను. అప్పటివరకు నా ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పారు. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులను, తోబుట్టువులను పోగొట్టుకున్నాను. వారు నా ఇంటిని కాల్చివేశారు. గోనో భవన్ నా ఆస్తి కాదు.. అది ప్రభుత్వానిదే. అది విప్లవం అని వారు చెప్తున్నారని, గుండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని హసీనా మండిపడ్డారు.
ఇంకా, తీర్పు వెలువడటానికి ముందు ఢాకా, పరిసర ప్రాంతాలలో భద్రతను పెంచారు. సామూహిక నిరసనలు, సమ్మె, బంద్‌కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. దీంతో ఢాకాలోని కోర్టు వెలుపల సాయుధ గార్డులు, అల్లర్ల పోలీసుల వరుసలు మోహరించబడ్డాయి. రాజధాని అంతటా పారామిలిటరీ సరిహద్దు గార్డులు, పోలీసులు మోహరించారు. ముహమ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్‌లో హిందువులు ప్రమాదంలో ఉన్నారని పార్టీ పేర్కొంది. గత ఏడాది జూలై-ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు షేక్ హసీనా నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు మరణ శిక్ష విధించింది. హసీనాతో పాటు మాజీ అంతర్గత మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌లకు ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఇంతలో, మాజీ పోలీసు చీఫ్ అల్-మామున్ జూలైలో నేరాన్ని అంగీకరించడంతో ఆరోపణలకు సంబంధించి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.