17-11-2025 06:20:48 PM
నూతన జీపి భవనం, వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
రేగొండ (విజయక్రాంతి): గ్రామాల అభివృద్దే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సోమవారం కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో రూ.25 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు శాలువాలు కప్పగా మహిళలు కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. నూతన జీపీ భవనంలో సెక్రటరీ గదిలో గ్రామ కార్యదర్శికి ఎమ్మెల్యే శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల పక్షాన నిలబడుతుందని వారి ఆసరాలకు అండగా ఉందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ ,రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు.రేగొండ మండలంలోని భాగిర్ది పేట గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవానికి రావాలని కోరుతూ భాగిర్దిపేట, దుంపిల్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు గౌడ కులస్తులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు చెన్నాపూర్ గ్రామంలో ఆహ్వాన పత్రికను అందించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.