10-09-2024 04:54:56 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): అత్యాధునికంగా తీర్చిదిద్దిన చర్లపల్లి నూతన టెర్మినల్‌తోపాటు శరవేగంగా ఆధునీకరణ పనులు జరుగుతున్న సికింద్రాబాద్ టెర్మినల్‌కు రోడ్ల విస్తరణకు సంపూర్ణ సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తారని వెల్లడించారు. రాష్ర్టంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యే క దృష్టిసారించి.. పదేళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదని తెలిపారు. రాష్ర్టంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్‌లో పూర్తవుతోందన్నారు.
కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ తోపాటు లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. సికింద్రాబాద్, కాచిగూ డ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని నగర శివార్లలోని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని స్పష్టంచేశారు. హైదరాబాద్‌కు సంబం ధించిన ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చర్లపల్లి రైల్వే టర్మినల్ కేంద్రం కానుందని చెప్పారు. ట్రాక్‌లతోపాటు స్టేషన్ నిర్మాణం, ప్రయాణికుల కోసం వసతులు అన్నీ పూర్తికావొచ్చాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
కీలకమైన రైల్వే టెర్మినల్ చేరుకునేందుకు ఎఫ్‌సీఐ గోడౌ న్ వైపు నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముందని అన్నారు. ఉత్తరం వైపు (భరత్ నగర్) కూడా 80 అడుగుల మార్గం, మహాలక్ష్మినగర్ వైపు మరో 80 అడుగుల రోడ్డు అవసరం అవుతుందని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ షెడ్స్ ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాల్సిన అవసరం ఉంద ని.. దీనిపై ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయించేలా ఆదేశించాలని కిషన్‌రెడ్డి కోరారు.
వచ్చే ఏడాది చివరి నాటికి సికింద్రాబాద్ పనులు పూర్తి
దక్షిణమధ్య రైల్వే కేంద్ర స్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని, వచ్చే ఏడాది చివరి నాటికి అత్యాధునిక వసతులతో అందుబాటులోకి వస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయని అన్నారు. రేతిఫైల్ బస్‌స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉన్న కారణంగా రద్దీ సమయాల్లో రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు తీవ్రమైన ట్రాఫి క్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
రైల్వేస్టేషన్ పనులు పూర్తయి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేనా టికి రోడ్డు విస్తరణ పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు వీలవుతుందన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే చొరవ వల్లే రాష్ట్రం లో రైల్వేల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఫలితంగా మెరుగైన ప్రజారవాణా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
సికింద్రాబాద్ నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు
తెలంగాణకు మరో వందేభారత్ రైలు రానుంది. సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మధ్య ఈ రైలు ప్రయాణిం చనుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. రెండు నగరాల మధ్య ఉన్న 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల్లో చేరేందుకు ఈ కొత్త రైలు ఉపయోగపడనుంది. షెడ్యూలు మేరకు ఈ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకోనుంది. ఈ రైలు తెలంగాణలోని కాజీపేట, రామగుండం స్టేషన్లలో మహారాష్ట్రలోని బలార్షా, చంద్రాపూ ర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది. మరో వందేభారత్ రైలును అందించినందుకు కేంద్ర రైల్వే శాఖకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.