17-11-2025 06:05:33 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని దుమాల గ్రామానికి చెందిన నీరంకి రవికి మెదడు సంబంధిత వ్యాధితో తన భార్య లత క్యాన్సర్ వచ్చి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. అదే గ్రామానికి చెందిన బద్దిపడగ మహేందర్ రెడ్డి ఇంట్లో మొన్న గ్యాస్ సిలిండర్ లీకై కిచెన్ గది దగ్ధమైంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలను సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి భరోసాను కల్పించి ఒక్కో కుటుంబానికి రూ.5000 చొప్పున రూ.10వేల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, బద్దిపడిగే దేవేందర్ రెడ్డి, గుల్లపల్లి సత్తిరెడ్డి, మల్లారెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, నిమ్మల బాలు, జంగ సతీష్, మల్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.