calender_icon.png 17 November, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి..

17-11-2025 06:10:02 PM

బాధిత కుటుంబానికి రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే..

పశు వైద్యశాల ద్వారా సమర్థవంతమైన సేవలు అందించాలి..

పాపన్నపేట (విజయక్రాంతి): పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటునందిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని చీకోడ్, నాగ్సన్ పల్లి గ్రామాల్లో పశు వైద్యశాలలను ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని యూసుఫ్పేట్ గ్రామానికి చెందిన మాస్కారి లక్ష్మయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్ఓసి కాపీనీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి లో చికిత్స కోసం మాస్కారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు సోమవారం కాపీనీ అందజేశారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించి కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ పేర్కొన్నారు. లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దని, ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలని ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే రోహిత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, ఆరేపల్లి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.