17-11-2025 06:18:27 PM
ఎంపీడీవో జలంధర్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఎంపీడీవో జలంధర్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నియమావళిని తప్పనిసరిగా అనుసరించాలని, ప్రతి వారము నిర్మాణ పురోగతిపై నివేదికను సమర్పించాలని అన్నారు. ఎటువంటి అవకతవకలు ఉన్నా, తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు.