calender_icon.png 26 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రెడ్డి విద్యాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయం

26-11-2025 09:59:10 PM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

కోదాడ: కోదాడలో సీసీ రెడ్డి విద్యాలయం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ క్రీడా చరిత్రలో మన దేశ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధిస్తూ దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్నారని మంత్రి అన్నారు. క్రీడలు శారీరిక మానసిక వికాసం తోపాటు నాయకత్వ లక్షణాలను అలవరుస్తాయని పేర్కొన్నారు.

కోదాడ పరిసర ప్రాంత విద్యారంగంలో ఈ పాఠశాలకు సముచిత చరిత్ర ఉందని పేర్కొన్నారు ఇక్కడ చదువుకున్న వందలాది మంది విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో సేవలందిస్తున్నారని కొనియాడారు. విద్యతోపాటు నైతిక విలువలు దేశభక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్య సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఎంతో మందికి విద్యనందించడం గొప్ప విషయం అన్నారు. జూబ్లీ వేడుకలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు  సబికులను అలరించాయి. ఈ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు ఏ జ్యోతి, పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, గ్రంథాలయం చైర్మన్ వంగవేటి రామారావు, అల్తాఫ్ హుస్సేన్, సామినేని ప్రమీల, నాయకులు పాల్గొన్నారు.