26-11-2025 09:56:48 PM
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
కొండపాక: కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో ఉదయం ఆరున్నర గంటలకు గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి సంతాన మల్లికార్జున స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి, విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వస్తి వాచనం, కలశ స్థాపన నవగ్రహ దిక్పాలక స్థాపన స్థాపిత దేవతా పూజ నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి,ఉత్సవ మూర్తులకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలతో అలంకరించి వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగింది మోహన్ కృష్ణ శర్మ, వేదవ్యాస్ లక్ష్మణ రావు తదితరులు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు చీకోటి మల్లికార్జున్ నర్సింహారెడ్డి గట్టు విఠల్ అయితా బాలరాజేశం మర్యాల రవీందర్ మర్యాల వీరేశం రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.