26-11-2025 10:00:46 PM
వేములపల్లి (విజయక్రాంతి): ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సతీష్ లు అన్నారు. బుధవారం వేములపల్లి మండలంలోని నార్కట్ పల్లి-అద్దంకి రహదారితో పాటు భీమవరం-సూర్యాపేట రహదారిపై తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రదేశాలను పరిశీలించారు. ఇటీవల నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాద స్థలాలను బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించి వీటిపై ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. వారి వెంట తహసిల్దార్ హేమలత, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.