22-05-2025 12:00:00 AM
మా ఇంటిమణి ద్వీపం కార్యక్రమం
కల్లూరు,మే21(విజయ క్రాంతి) ఆడపిల్ల ఇంటికి వెలుగని, మగ పిల్లవాడితో సమానంగా ఆడపిల్లలను పెంచాలని సీ డీ పీ ఓ నిర్మల జ్యోతి అన్నారు. బుధవారం మండ లం పరిధిలో చండ్రుపట్ల గ్రామంలో మా ఇంటి మణిదీపం కార్యక్రమం ఆమె నిర్వహించారు.
గ్రామంలో బండి శైలజ, సాయి కుమార్ దంపతులకు ఆడబిడ్డ జన్మించిన వి షయాన్ని తెలుసుకున్న సీడిపివో బాలింత ఇంటికి వెళ్లి స్వీట్స్, పండ్లు అందించి, శాలువతో తల్లిదండ్రులను, అమ్మమ్మ తాతలను సన్మానించారు.
ఆడపిల్ల ఇంటికి వెలుగని అడ బిడ్డను మగ పిల్లవాడితో సమానంగా పెంచాలని, చదివించాలని తల్లిదండ్రులకు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చం ద్రశేఖర్, పంచాయితీ సెక్రటరీ, సూపర్వైజర్ సుజాతా ఏఎన్‌ఎం విజయ కుమారి అంగన్వాడి టీచర్ లు, ఆశ వర్కర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.