calender_icon.png 23 May, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్ల పుడితే ఇంటికి భారం కాదు

22-05-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 21:( విజయ క్రాంతి) ఆడపిల్ల పుడితే భారం కాదు ఇంటికి మణిహారం అని, అమ్మాయితో ఇం టికి మహలక్ష్మి వచ్చిందని భావించాలని జి ల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఆడపిల్లలు పుట్టడం అదృష్టమని తెలుపుతూ ప్ర తి  బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తు న్న మా పాప - మాఇంటి మణిదీపం. కార్యక్రమంలో భాగంగా వైరా మండలం రెబ్బ వరం గ్రామంలో అనుషా కుటుంబ సభ్యు లు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్త అం దంగా ఇంటిని ఆలంకరించి ఆడపిల్లలను పు ట్టనిద్దాం..

ఆడపిల్లలను పెరగనిద్దాం  అనే ని నాదాలతో ముగ్గులు వేసి కలెక్టర్ కు  ఘన స్వాగతం పలికారు. గుత్తా అనుషా, వెంకటరామారావు దంపతులకు మార్చి,10 న ఆడ పిల్ల పుట్టిన విషయం తెలిసి, వారి ఇంటికి వచ్చిన జిల్లా కలెక్టర్, పాప తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ, తాతయ్య, బంధువులను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అం దించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో స న్మానించారు.

చేతులతో పాపను ఎత్తుకొని పాప చిరునవ్వుకు కలెక్టర్ మురిసిపోయారు. సమాజానికి ఆడపిల్లల ఆవశ్యకత ఏలాంటిదో వివరించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ, వైరా తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలక్ష్మి, ఆశా కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.