calender_icon.png 24 May, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 రోజుల్లోగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

22-05-2025 12:00:00 AM

సిరిసిల్ల, మే.21( విజయక్రాంతి ) ఎల్లారెడ్డిపేట ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్దిదారులు 30 రోజులు లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్దిదారులకు సూచించారు.బుధవారం కలెక్టర్ ఎల్లారెడ్డి పేట మండలం లో రెండో విడత క్రింద 643 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో కేకే మహేందర్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఎల్లారెడ్డిపేట మండలంలో రెండో విడత కింద 643 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి నేడు ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు.

బేస్మెంట్ నిర్మాణం పూర్తున తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని , నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో పెడతామని తెలిపారు. మండలంలో ఉన్న 23 గ్రామాలకు ఇసుక రీచ్ లను అలాట్ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు.

30 రోజుల లోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని లేని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామని అన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సొంత స్థలంలో మంచి ఇండ్లు నిర్మించుకొని ప్రజల సంతోషంగా ఉండాలని  ఆకాంక్షించారు.కార్యక్రమంలో పిడి హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ సవేరా బేగం, PACS  చైర్మెన్ కృష్ణ రెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవో సత్తయ్య, తాసిల్దార్సుజాత,సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.