calender_icon.png 23 May, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నకిలీ పత్తి విత్తనాలపై అవగాహన ర్యాలీ... మానవహారం, ప్రతిజ్ఞ

23-05-2025 04:23:21 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): తాండూర్  పోలీస్ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమం,ర్యాలీ మానవహారం నిర్వహించారు. ప్రతిజ్ఞ చేపించారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాండూరు సిఐ కుమారస్వామి వ్యవసాయ అధికారులతో కలిసి మాట్లాడారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట దిగుబడి తగ్గుతుందన్నారు. అదేవిధంగా పర్యావరణం పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనీ తెలిపారు.

కౌలు రైతులు కూడా ఈ నకిలీ విత్తనాలను వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందని, ఈ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రెండు మూడు క్వింటాళ్లు అధిక లాభం వస్తుందని ఆశపడితే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం రాదన్నారు. నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని ఒకవేళ గుట్టుచప్పుడు కాకుండా దొంగ చాటున వీటిని పంట పొలాల్లో విత్తనాలు నాటుతున్నారని తెలిస్తే అక్కడికి వచ్చి పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రతి ఒక్క రైతు ఫెర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ విత్తనాలు తీసుకున్న తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడి రావడంతో పాటు లాభాలు కూడా వస్తాయన్నారు.

గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడడం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందనీ తెలిపారు. ఎవరు కూడా నకిలీ విత్తనాలలు అమ్మడం, కొనడం కానీ చేయకూడదన్నారు. ఏ గ్రామంలోనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకీ సమాచార ఇవ్వాలని వ్యవసాయ అధికారులు కోరారు.  తాండూర్ ఎంపీడీవో కార్యాలయం నుండి ఐబీ కేంద్రం వరకు భారీ ర్యాలీ చేసి ఐబీ కేంద్రంలో 500 రైతులతో మానవహారం ఏర్పాటు చేసారు. నకిలీ విత్తనాలు వాడొద్దని ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కిరణ్ కుమార్, తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారిని సుష్మ, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, రైతులు పాల్గొన్నారు.