23-05-2025 04:56:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు బోధన పద్ధతుల్లో కొత్త ఆలోచనలు విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సందర్శించి జీవశాస్త్ర విధానం సైన్స్ తదితరు అంశాలపై బోధన పద్ధతులను వివరించారు. స్కూల్ లో నిర్మల్ జిల్ రిసోర్స్ పర్సన్స్ గత వారం రోజులు నుండి వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు.
మానవ శరీరంలోని వివిధ నాడు గుండెలోని గదులు, గుండె పనిచేసే విధానం, గుండె లోని భాగాలు, కిడ్నిలు మరియు కండరాలు పనిచేసే విధానం, కదలికలు గురించి నిర్మల్ జిల్లా జీవశాస్తం డీఆర్పీ (District Resource Persons) డీ.మోహన్ రావు, పీ.గంగ సురేష్, ఎం.సుభాష్, బాలకృష్ణ, విజయ కుమార్ లు శిక్షణకి వచ్చిన జీవ శాస్త్రం టీచర్లకు ప్రత్యక్ష అవగాహన కలిగించారు. నిర్మల్ జిల్లా డీఈఓ(DEO) శ్రీ రామరావు, బయో సైన్స్ కోర్సు డైరెక్టర్ మోహన్ లు తదితరులు పాల్గొన్నారు.