calender_icon.png 29 July, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థాయ్-కంబోడియా మధ్య కాల్పుల విరమణ

29-07-2025 02:06:37 AM

ప్రకటించిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం

న్యూఢిల్లీ, జూలై 28: కొంతకాలంగా సరిహద్దు ఘర్షణలో మునిగిన థాయ్‌లాండ్ షరతులు లేని కాల్పుల విరమణకకు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సోమవారం ప్రకటించారు. సరిహద్దుల్లో కాల్పులతో చెలరేగిపోతున్న ఇరుదే శాలు ఎట్టకేలకు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించినట్టు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ నేప థ్యంలో చర్చల కోసం సోమవారం మలేసియాలో భేటీ కావాలని థాయ్, కంబోడియా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే తాజా గా సానుకూల ఫలితం వచ్చింది. సరిహద్దు వెంట మందుపాతర పేలడంతో థాయ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడటం తో ఇరుదేశాల మధ్య ఘర్షణ మొదలైంది.

సైన్యాలు పరస్పరం తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్లతో దాడులు చేసుకున్నా యి. దీంతో కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతోపాటు ఆ దేశ రాయబారిని థాయ్‌లాండ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఘర్షణలలో 30 మందికి పైగా చనిపోగా, సుమారు రెండు లక్షల మంది నిర్వాసితులయ్యారు.