29-07-2025 02:04:35 AM
న్యూఢిల్లీ, జూలై 28: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. అనంతరం దుండగుడు తన ను తాను కాల్చుకున్నాడు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అక్కడి మీడియా తెలిపిన ప్రకా రం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓర్ టు కో మార్కెట్‌లోకి చొరబడి నలుగు రు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళను మట్టుబెట్టాడు.
అనంతరం తననుతాను కాల్చు కున్నాడు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జర గింది. స్థానికులతో పాటు పర్యాటకులు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ కాల్పులకు థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దు వద్ద జరుగుతున్న ఘర్షణలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మే నెలలో సైతం థాంగ్ జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పో యారు.