31-12-2025 01:43:04 AM
మఠంపల్లి, డిసెంబర్ 30: నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంగళవారం మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి.బాబు ఒక ప్రకటనలో తెలిపారు.న్యూ ఇయర్ వేడుకల పేరుతో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వేడుకలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. మండల వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు,పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.అదే విధంగా సాయంత్రం 6 గంటల నుండి వాహనాల తనిఖీ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. వాహనాల తనిఖీలో మైనర్లు పట్టుబడితే వారితో పాటు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.