31-12-2025 01:43:20 AM
మూడు డీసీపీలు, ఐదు ఏసీపీలు కేటాయింపు
ఆమనగల్లు, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది ఇటీవలనే ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైసింగ్ సమ్మిట్ ను నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సిటీపై అంచనాలు పెంచింది. దానిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో భద్రతాపరంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరిటా నూతన కమిషనరేట్ ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దానికి కమిషనర్ గా సిపి సుధీర్ బాబును సైతం నియమించింది. జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలకు డీసీపీ హోదా ను కల్పించి ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తెచ్చింది. ఫ్యూచర్ సిటీ పరిధిలో మొత్తం 22 పోలీస్ స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. గతం లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్లను హైదరాబాద్ కమిషనరేట్ లో విలీనం చేసింది.
ఫ్యూచర్ సిటీ పరిధి లో మహేశ్వరం డీసీపీ పాటు నూతనంగా ఏర్పాటు చేసిన మొయినాబాద్, షాద్నగర్ డీసీపీ లను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. నూతనం గా ఆమనగల్, చేవెళ్ల, మొయినాబాద్ లకు ఏసీపీ లను కేటాయించారు. అమంగల్ మండలానికి ఏసీబీ ఓదానం కేటాయించడంతో ఆమనగల్ బ్లాక్ మండల వార్సులు హర్షం వెళ్లిబుచ్చారు. ఆమనగల్ ఏసిపి పరిధిలో ఆమనగల్,కేశంపేట్,మాడుగుల, తలకొండపల్లి పోలీస్ స్టేషన్ల పరిధి కేటాయించారు.