calender_icon.png 3 August, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దరన్న రెండవ వర్దంతిని జయప్రదం చేయండి

02-08-2025 09:00:44 PM

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్..

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ప్రజా యుద్ద నౌక గద్దరన్న రెండవ వర్దంతి సభ అగస్టు 6న హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దరన్న వర్దంతి సభ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, పిడిత ప్రజల విముక్తి కోసం గద్దరన్న జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. గద్దర్ పౌండేషన్ అధ్వర్యంలో గద్దరన్న రెండవ వర్దంతి సభను నిర్వహిస్తున్నారన్నారు. ఈ సభకు కళాకారులు, ప్రజసంఘాల నాయకులు, ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, జర్నలిస్టులు శ్రీనివాస్, మహేష్, ప్రశాంత్, షాదుల్లా, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.