02-08-2025 08:56:05 PM
కోదాడ: కోదాడలోని తేజ ఫార్మసీ కళాశాల(Teja College of Pharmacy)లో ఫార్మసీ 4వ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు పూర్తి చేసుకొని శనివారం సిగ్నేచర్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, సీఈఓ ఎస్ఎస్ రావులు మాట్లాడుతూ, విద్యార్థులు నాలుగు సంవత్సరాలు ఫార్మసీ విద్యను పూర్తిచేసుకుని బయటికి వెళుతున్నందుకు వారిని అభినందించారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు సమాజంలోకి వెళుతున్నందున, వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని తల్లిదండ్రులకు, కళాశాలకు, మంచి పేరు తేవాలని జీవితంలో క్రమశిక్షణ, కృషి పట్టుదల మాత్రమే అనుకున్న ఆశయాలను సాధించేందుకు మార్గాలని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాళ్ళు కవిత, సాహితీ, సల్మా, అంజుమ్ వీరకుమారి, నిఖత్, అమ్రిన్, అరుణ, సిబ్బంది ప్రవీణ ,జి నాగేశ్వరరావు ,బి నాగేశ్వరరావు పాల్గొన్నారు.