calender_icon.png 1 January, 2026 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్’లో వేడుకలు

01-01-2026 01:06:26 AM

ఖమ్మం, డిసెంబర్ 31 (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా రాబోయే సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చిన్నారులు  ఆట, పాటలతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనందించారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని, మంచి అలవాట్లు అలవర్చుకుని, అవధులులేని ఉత్సాహంతో ముందుకు సాగాలని,  గత సంవత్సరం అనుభవాల స్ఫూర్తితో, ఈ సంవత్సరం  ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని అత్యున్నత స్థాయికి ఎదగాలని మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ.. గత సంవత్సరంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, గత సంవత్సరంలో నేర్చుకోలేని మంచి విషయాలను కొత్త సంవత్సరంలో నేర్చుకొని ముందుకు సాగాలన్నారు. నూతన సంవత్సర కేక్‌ను కట్‌చేసి చిన్నారులకు పంచారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.