calender_icon.png 1 January, 2026 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

01-01-2026 01:06:44 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ

వేములవాడ, డిసెంబర్ 31,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలో ఒకినావా స్పోరట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరాటే వంటి యుద్ధకళలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులను వేదికపైకి తీసుకొచ్చే ఈ పోటీలు వేములవాడకు మంచి గుర్తింపు తీసుకొస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ సబ్కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత అవధూత రజినీకాంత్, అకాడమీ ఫౌండర్/నిర్వాహకులు అబ్దుల్ మన్నన్, సీనియర్ జర్నలిస్ట్ లాయక్ పాషా పాల్గొన్నారు. అలాగే సీనియర్ బ్లాక్ బెల్ట్ గ్రహీతలు మంగళగిరి శ్రీనివాస్, దండుగల తిరుపతి, శంకర్, లోలోపు రాజు, మానపాటి తిరుపతి,కనకరపు రాజశేఖర్, కావ్య, ఫర్హాన్ అబ్బాసి, బోడుగే శ్యామ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.నిర్వాహకుల వివరాల ప్రకారం, ఈ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ఫిబ్రవరి 8న వేములవాడ పట్టణంలోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు.