10-10-2025 12:33:33 AM
ముంబై, అక్టోబర్ 9: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. భారత్‌ది ‘డెడ్ ఎకానమీ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడానికి కౌంటర్‌గా స్టార్మర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక భారత పర్యటనలో ఉన్న కీర్ స్టార్మర్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఇరు దేశాధినేతలు స మావేశం జరిపారు.
అనంతరం మీడియా సమావేశంలో సం యుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ‘నమస్కార్ దోస్తాన్.. 2028 నాటికి భార త్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం గా పెట్టుకుంది. అందుకు గానూ ప్రధాని మోదీ నాయకత్వానికి అభినందనలు. ఇక్కడికొచ్చి పరిస్థితులు చూస్తుంటే మీరు లక్ష్యా న్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెంది న దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ ప్రయాణంలో మేమూ భాగం కావాలనుకుంటున్నాం’ అని తెలిపారు. భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు.అనంతరం భారత్‌లో త్వరలోనే తొ మ్మిది యూకే యూనివర్సిటీల క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం యూకే, భారత్ మధ్య విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని బ్రిటన్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. యూకేతో జరిగిన వాణి జ్య ఒప్పందం చాలా గొప్పదని భారత ప్రధాని మోదీ అభివర్ణించారు. బ్రిటన్ భారతదేశానికి పంపిం న అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని మోదీ కొనియాడారు.
భారత్‌ది ‘డెడ్ ఎకానమీ’ కాదు
భారత్‌ది ఎంతమాత్రం ‘డెడ్ ఎకానమీ’ కాదని, అత్యంత ఆర్థిక వ్యవస్థగా మారుతున్న దేశాల్లో ఒకటని కీర్ స్టార్మర్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్‌పై 50 శాతం సుంకాలు విధిస్తూ.. భారత్‌ది ‘డెడ్ ఎ కానమీ’ అని అభివర్ణించారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు అర్ధమయిందని స్టార్మర్ వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను మెచ్చుకోకుండా ఉండలేమన్నారు.
భారత్ ప్రయాణంలో తాము భాగం కావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కసుతో ట్రంప్ భారత్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇక స్టార్మర్ తన పర్యటనలో 100 మందికి పైగా సీఈవోలు, ఎంటర్‌ప్రెన్యూర్లు, యూనివర్సిటీ ఛాన్సలర్లతో కూడిన ప్రతినిధి బృంధంతో మన దేశంలోకి అడుగుపెట్టడం చూస్తే భారత్ ఆర్థి కం పరంగా ఎంత అభివృద్ధి చెందిందనేది స్పష్టమవుతుంది.
ఒప్పందం చారిత్రాత్మకం
భారత్-యూకే మధ్య యూనివర్సిటీల ఏర్పాటుకు ఒప్పం దం కుదరడం చారిత్రక మైలురాయిగా స్టార్మర్ అభివర్ణించారు. నాణ్యమైన ఉన్నత విద్యకు ఈరోజుల్లో డిమాండ్ పెరుగుతోందని, అందుకే భారత్‌లో మరిన్ని బ్రిటీష్ యునివర్సిటీలను ఏ ర్పాటు చేస్తామని తెలిపారు. సాంకేతిక, సృజనాత్మక, కృత్రిమమేధలో భారత్, యూకేల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందన్నా రు. జూలైలో రెండు దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అత్యంత ముఖ్యమైనదని అన్నారు. కాగా జూలై 2024లో ప్రధాని మోదీ యూకే పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ఏటా 25.5 యూరో బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో ఒప్పందం చేసుకు న్న సంగతి తెలిసిందే.
భారత్‌లో ఏర్పాటు కానున్న యూకే యూనివర్సిటీల జాబితా
* సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం: గురుగ్రామ్
* లివర్‌పూల్ విశ్వవిద్యాలయం: బెంగళూరు
* యార్క్ విశ్వవిద్యాలయం: ముంబై
* అబెర్టీన్ విశ్వవిద్యాలయం: ముంబై
* బ్రిస్టల్ విశ్వవిద్యాలయం: ముంబై
* లంకాస్టర్ విశ్వవిద్యాలయం: బెంగళూరు
* సర్రే విశ్వవిద్యాలయం: గుజరాత్
* మరో రెండు యూనివర్సిటీల పేర్లు ప్రకటించాల్సి ఉంది.