11-10-2025 12:00:00 AM
కలెక్టరేట్ ఎదుట బాధితుల ధర్నా
జనగామ, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : అక్రమంగా పొందిన సెల్ టవర్ నిర్మాణం, అనుమతిని వెంటనే రద్దు చేయాలని. ధర్మ కంచ స్వీపర్ కాలనీవాసులు కోరారు. పట్టణంలోని ధర్మకంచా 13వ వార్డు, స్వీపర్ కాలనీ ఖాళీ స్థలంలో ఇల్లు లేకున్నా అక్రమంగా హౌస్ నెంబర్ తీసుకొని అట్టి స్థలంలో నిర్మిస్తున్న సెల్ఫోన్ టవర్, అనుమతులు రద్దు చేయాలని. డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వీపర్ కాలానికి చెందిన బాధితులు పానుగంటి సువార్త, తోకల అన్నపూర్ణ, మారపల్లి ప్రేమలత, స్వప్న, పులి ప్రమీలలు, మాట్లాడుతూ.. గత కొన్ని ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో ఫోర్త్ క్లాస్ లేబర్, గా పనిచేస్తున్న తమ తల్లిదండ్రులకు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం కేటాయించి తమకు అప్పగించారని తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు ఆట్టి స్థలంలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నామని అన్నారు.
అనంతరం ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రిజ్వాన భాషా షేక్ కు వినతి పత్రం అందజేసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బిల్డింగ్ ల పైన నిర్మించుకోవడానికి మాత్రమే అనుమతులు ఇస్తారని, జనవాసాల మధ్య ఓపెన్ ప్లాట్ లో సెల్ టవర్లు, నిర్మించడానికి అనుమతుండదన్నారు.
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి వెంటనే పరిశీలించి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ కాలనీవాసులు మాదారపు సుజాత, తిప్పారపు యాకూబ్, తోకల హరీష్, కోడిశాల హరీష్, బొట్ల శంకర్, చింతల సాయి, తూడి రంజిత్, గంగారపు కిషన్, ఎర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.